గ్యాంగ్‌స్టర్‌గా మారిన డేవిడ్ వార్నర్.. పుష్ప-2 లో కీలక పాత్ర..?

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (david warner) అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. మరీ ముఖ్యంగా ఆయనకు సోషల్ మీడియాలో భారత్‌లో అత్యధిక అభిమానులు ఉంటారు.

Update: 2024-09-19 10:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్( David Warner) అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. మరీ ముఖ్యంగా ఆయనకు సోషల్ మీడియాలో భారత్‌లో అత్యధిక అభిమానులు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ సంఖ్యలో వార్నర్(Warner) అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగు సూపర్ హిట్ సినిమాల్లోని హిట్ డైలాగ్స్ చెబుతూ.. పాటలకు డ్యాన్స్ చేస్తూ లక్షల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ సినిమాల్లోని డైలాగ్స్ చెప్పడంలో వార్నర్ తనకంటూ ప్రత్యేక స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వార్నర్‌తో భారత మార్కెటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే పలు ప్రకటనలు చేయించాయి. అందులో వార్నర్ యాక్టింగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి కలిసి వార్నర్ ఓ యాడ్‌లో చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా వార్నర్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో వార్నర్ చేతిలో గన్ పట్టుకొని కనిపించాడు. చుట్టూ బాడీగార్డులు.. చేతిలో గోల్డ్ కలర్ గన్ పట్టుకొని గ్యాంగ్‌స్టర్‌ (gangster) లుక్‌లో వార్నర్ అదరగొట్టాడు. కాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. డాన్ లుక్‌లో ఉన్న వార్నర్ పుష్ప-2 (PUSHPA 2) సినిమాలో నటిస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే వార్నర్ లుక్ చూస్తే పిచ్చెక్కి పోతుందని.. చిన్న పాత్రలో అయిన ఆయన పుష్ప-2 సినిమాలో కనిపిస్తే బాగుంటుందని.. అభిప్రాయపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం వార్నర్ ఈ మధ్య ఎక్కువగా యాడ్స్ చేస్తున్నారని.. అందులో భాగంగానే ఈ స్టిల్ తీసి ఉంటారని.. రాసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికి వార్నర్ లుక్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. కాగా ఈ ఫొటోపై సినిమా చిత్ర బృందం లేదా.. స్వయంగా వార్నర్ స్పందిస్తే గాని క్లారిటీ రాదు.

 


Similar News