Trending: సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు..!

ట్రాఫిక్ చలాన్ల బారి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Update: 2024-08-17 07:22 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: ట్రాఫిక్ చలాన్ల బారి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొందరు ట్రాఫిక్ పోలీసుల కంటపడకుండా వాహనాల నంబర్ ప్లేట్స్ తీసేయడం లేదా స్టికర్లు అంటించి టాంపరింగ్ చేయడం వంటివి చేస్తూ ట్రాఫిక్ వయోలేషన్‌కు పాల్పడుతుంటారు. కానీ, జగిత్యాల‌లో ఓ వాహన‌దారుడు పోలీసులకే సవాల్ విసిరేలా బైక్ నంబర్ ప్లేట్‌పై రేడియం స్టికర్స్ అంటించుకున్నాడు. నంబర్ ప్లేట్ ఆర్టీఏ రూల్స్ ప్రకారం.. ప్రాపర్‌గా పెట్టకపోగా దాని కిందనే ‘సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు’ క్యాప్షన్ రాశాడు. శనివారం జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద నిలిపి ఉంచిన ఆ బైక్ పట్టణ పోలీసుల కంట పడింది. దీంతో రియాక్ట్ అయిన పోలీసులు వెంటనే ఆ బండితో పాటు వాహన ఓనర్‌‌ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, బండికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News