Trending: ముంబై నగరంలో షాకింగ్ ఘటన.. ఫ్లై ఓవర్ కింద వెళ్తున్న కారుపై కూలిన స్లాబ్

వరుస వర్షాలతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఫ్లై ఓవర్లు కుప్పకూలుతున్నాయి.

Update: 2024-07-05 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస వర్షాలతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఫ్లై ఓవర్లు కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలోనే ముంబై మహా నగరంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంధేరిలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్తున్న ఓ కారుపై స్లాబ్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంస కగా, డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Similar News