Trending: నీట్ క్రాక్ చేసిన సమోసా వాలా.. ఇతని కథ తెలిస్తే వావ్ అనాల్సిందే(వీడియో)
ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఇతను నిత్యం సోషల్ మీడియాలో స్ఫూర్తి దాయక కథలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. అవి విద్యార్థులకు ఎంత గానో యూజ్ ఫుల్‌గా ఉంటాయి. వాటినే స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఈ క్రమంలో తాజాగా ఇతను పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సాధారణంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రాముల్లో ప్రవేశం కోసం నిర్వహించే భారతీయ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ కోసం ఎంతగా కష్టపడాలో మనకు తెలిసిందే. అలాంటి పరీక్షలో ఉత్తీర్ణుడైన నోయిడాకు చెందిన 18 ఏళ్ల యువకుడి గురించి ఆయన ఓ పోస్ట్ పెట్టారు. యువకుడు సమోసాలు విక్రయిస్తూ నీట్ యూజీని క్రాక్ చేసినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఫిజిక్స్ వాలా సన్నీ కుమార్‌కు సంబంధించిన 2 వీడియోలను షేర్ చేశాడు.. అందులో మొదటి వీడియోలో ఆ విద్యార్థి గదిలోని గోడలు మొత్తం నోట్ బుక్స్‌తో నిండిపోయిన దాని గురించి అతన్ని పొగుడుతూ వీడియో చేస్తే.. మరో వీడియోలో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ ముగించుకుని రాత్రి 4-5 గంటల పాటు సమోసా స్టాల్లో పనిచేస్తూ కేవలం ఏడాది ప్రిపరేషన్‌తో నీట్ 2024 పరీక్షలో 720కి 664 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు అనే విషయాలను వెల్లడిస్తూ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం సమోసాలు అమ్ముకుంటూ నీట్ యూజీ క్రాక్ చేసిన సన్నీ కుమార్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త చదివిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సన్నీ కుమార్ కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే కథని మాట్లాడుకుంటున్నారు.
(video link credits to physicswallah instagram id)