Trending: సీజేఐ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలు.. రూ.500 పంపిస్తారా అని మెసేజ్!

దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు.

Update: 2024-08-28 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో కొందరు అక్రమార్కులు ఈజీగా డబ్బు ఎలా సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. క్యూ ఆర్ కోడ్స్, వెబ్ లింకులతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుని సైలెంట్‌గా చెక్కేస్తున్నారు. మరికొందరు కేటుగాళ్లు ఎలాంటి కండీషన్లు లేకుండా లోన్లు ఇస్తామని, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మబలికి జనాలను నిండా ముంచేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా.. సైబర్ మోసగాళ్లు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేరిట మోసానికి తెగబడ్డారు. ‘హాయ్, నేను సీజేఐని. ఇక్కడ కన్నాట్ ప్లేస్‌లో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయా. అర్జెంటుగా కోర్టుకు వెళ్లాలి.. క్యాబ్ కోసం ఓ రూ.500 రూపాయలు పంపించండి’ అంటూ నేరగాడు ఓ వ్యక్తికి ఫోన్‌కు మెసేజ్ చేశాడు. అయితే, అంత పెద్ద మనిషి తనకు ఎందుకు మెసేజ్ చేస్తాడని గ్రహించి ఆ వ్యక్తి మెసేజ్‌కు రెస్పాండ్ కాలేదు. అయితే, తనకు జరిగిన మోసాన్ని సదురు వ్యక్తి స్కీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా.. సీజేఐ చంద్రచూడ్ వరకు వెళ్లింది. దీంతో ఆయన జరుగుతన్న మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Similar News