Megastar Chiranjeevi:చిరంజీవి మొదటి నాటిక వేసింది ఈ వేదిక మీదే..(ఫొటోస్ వైరల్)

మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) మొగల్తూరులో చదువుతుండగా నటుడి అవతారమెత్తారు.

Update: 2024-10-27 10:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) మొగల్తూరులో చదువుతుండగా నటుడి అవతారమెత్తారు. ఆయన నటుడిగా పరిచయమైంది ఎక్కడ? ఎప్పుడు? ఎలా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథనం చదవాల్సిందే. కొణిదెల శివశంకర్‌ వర ప్రసాద్‌ అలియాస్ చిరంజీవి మొదటిసారి ఓ నాటికలో కనిపించారు. శ్రీ పెన్మెత్స రంగరాజు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన 7, 10 తరగతులు చదివారు. 1970లో పదవ తరగతి చదువుతుండగా ఫస్ట్‌ స్టేజీ పెర్ఫారెన్స్‌ ఇచ్చారు. మెగాస్టార్‌ నట జీవితంలో తొలి అడుగు వేసిన ఆ నాటిక పేరు 'పరధ్యానం పరంధామయ్య’.

తొలి నాటికతోనే ఉత్తమ నటుడిగా అవార్డు(Award for Best Actor) అందుకున్నారు. ఈ నాటికకు కత్తుల పండరీనాధ సత్యప్రసాద్‌ రచన, దర్శకత్వం చేయగా, దశిక సుబ్రహ్మణ్యం దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అందులో పరంధామయ్యగా చిరంజీవి ముఖ్య పాత్ర పోషించారు. స్కూల్‌ డేస్‌లో ఆయన వేసిన తొలి నాటకమిదే. చిరంజీవి ఏ స్టేజ్‌పైన అయితే ఈ నాటకం వేశారో ఆ వేదిక ఇప్పటికీ మొగల్తూరులో అలాగే ఉంది. దానికి 'చిరంజీవి కళా వేదిక' అనే పేరు ఉంది. ఆ పేరుతో శిలా ఫలకం కూడా ఉంది. ఇప్పుడు ఆ వేదికకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

 

Tags:    

Similar News