Trending: హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్..

ప్రపంచ వ్యాప్తంగా పలు అధికారిక ‘X’ (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయ్యాయి.

Update: 2024-09-19 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా పలు అధికారిక ‘X’ (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ క్రమంలోనే హ్యాకర్లు హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) అధికారిక ‘ఎక్స్’ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు. ఇందులో భాగంగా సైబర్ కేటుగాళ్లు మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఏకంగా ఆ సంస్థ అఫీషియల్ అకౌంట్‌లో #HACKED ON SOLANA పేరుతో ట్వీట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన టెక్నికల్ టీమ్ హుటాహుటిన హైదరాబాద్ మెట్రో రైల్ ‘ఎక్స్’ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించారు.


Similar News