Hidden cameras: హార్పిక్ బాటిల్‌లో సీక్రెట్ కెమెరా.. వాష్‌రూమ్‌లో దారుణాలు.. అసలేం జరిగింది?
Hidden cameras: టెక్నాలజీ..మానవాళికి ఎంత మంచి చేస్తోందో..ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడితే అంతే చెడు చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: Hidden cameras: టెక్నాలజీ..మానవాళికి ఎంత మంచి చేస్తోందో..ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడితే అంతే చెడు చేస్తోంది. ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివ్రుద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే..సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని.. ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో, హోటల్స్ లో, బాత్రూమ్ లలో స్పై కెమెరాలు అమర్చిన ఘటనలు ఎన్నో వింటున్నాం.ఇలాంటి ఘటనల నుంచి మిమ్మిల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ సురక్షితమైన, ప్రైవేట్ వాతావరణంలో ఉండాలని కోరుకుంటారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్స్ లో ఉండాల్సిన సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. అయితే బాత్రూమ్ వంటి ప్రైవేట్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు ప్రజల భద్రత గురించి ఆందోళనలను లెవనెత్తున్నాయి.
ఎందుకంటే మీ ప్రైవేట్ కార్యకలాపాలను టాయిలెట్ క్లీనర్ బాటిల్ లోని రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ కెమెరాలు బాత్రూమ్ లోనే కాదు ఎక్కడైనా ఉండొచ్చు. అమ్మాయిలు సేఫ్టీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా హోటల్స్ లలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. లాడ్జీలకు వెళ్లినప్పుడు లేదా మాల్స్ లో బట్టలు మార్చేకునేందుకు వెళ్లినప్పుడు మహిళలు, అమ్మాయిలు ఎంతో అలర్ట్ గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవలి కాలంలో కేటుగాళ్లు బాత్రూమ్ లోని హార్పిక్ బాటిల్ కు రహస్య కెమెరాలు పెట్టిన ఘటన భయటపడింది.
ఈ కెమెరాలు టాయిలెట్ క్లీనర్ బాటిలో లోపల ఉంటాయి. వాటిని గుర్తించడం అంత తేలికైన విషయం కాదు. ఈ కెమెరాలు హెచ్డీ క్వాలీటీతో వీడియోలను రికార్డ్ చేస్తాయి. ఇలా కెమెరాలను అమర్చి మీ ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అనుమతి లేకుండా ప్రైవేట్ కార్యకలాపాలను రికార్డ్ చేసినట్లయితే అది పూర్తిగా చట్టవిరుద్ధం. దోషులకు శిక్ష కూడా పడుతుంది. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి.
భద్రతను ఎలా నిర్థారించాలి?
బాత్రూమ్ లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే ముందు మీ భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. చీకటిలో ఎక్కడైనా చిన్నగా లైటింగ్ ఉందా అని గమనించాలి. హిడెన్ కెమెరాల లైటింగ్ బ్లింక్ అవుతుంటుంది.
2. హోటల్ప్ గదిలో పుస్తకాలు, పూలకుండీలు, బల్బులు, ఇతర వస్తువులు ఉంటే..వాటిని జాగ్రత్తగా గమనించాలి. వాటిలో కూడా హిడెన్ కెమెరాలను అమర్చే ఛాన్స్ ఉంటుంది.
3. బాత్రూమ్ లకు వెళ్లినప్పుడు వాష్ బేసిన్ కు ముందు, డోర్ కు ఏమైనా..కెమెరాలు లేదా మరేదైన వస్తువులు ఉన్నాయా అనేది చూసుకోవాలి. బట్టలు మార్చుకునే ముందు గది అంతా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం మంచిది.
4. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్స్ ఉంటాయి. అవి కూడా రహస్య కెమెరాలను స్కాన్ చేసి గుర్తిస్తాయి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఫోన్ కెమెరాని ఉపయోగించి , రహస్య కెమెరాలను పట్టేస్తాయి.