Swiggy: విలువైన బూట్లు ఎత్తుకెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్.. వీడియో వైరల్

Update: 2024-09-17 11:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ డెలివరీకి వచ్చిన ఓ డెలివరీ బాయ్ ఇంటి ముందు ఉంచిన విలువైన షూ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. ఘటన ప్రకారం నోయిడా సెక్టార్ -73 ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్యామిలీ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ డెలివరీ చేసేందుకు తలకు హెల్మెట్ ధరించిన ఓ డెలివరీ ఏజెంట్ వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన అనంతరం ఓ ఇంటి ముందున్న షూ ర్యాక్ లో విలువైన బూట్లను బ్యాగులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా ఇలాగే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ బాయ్ ఓ ఇంటి ముందు ఉంచిన బూట్లను దొంగిలించిన ఘటన గురుగ్రాంలో జరిగింది. దీనిపై ఇంటి యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పై దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని చెప్పినట్లు తెలిసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. గతంలో ఓ వ్యక్తి ఇలాగే చేసి ఫేమస్ అయ్యాడని, అతని లాగే అవ్వాలని చేశాడేమో అని, తన గురించి కూడా సోనూసూద్ స్పందించాలని చేసినట్లున్నాడని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Similar News