ఇదేం బైక్‌రా బాబు? రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్! దూసుకుపోవడమే కాదు..
సాధారణంగా టూ వీలర్ బైక్‌లకు ట్యూబ్ ఉన్నవి, ట్యూబ్ లెస్ టైర్లు చుస్తుంటాము. మరోవైపు టైర్లు పూర్తిగా చెక్క, ఇనుముతో చేయబడిన విచిత్ర టైర్లు చూశాము
దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా టూ వీలర్ బైక్‌లకు ట్యూబ్ ఉన్నవి, ట్యూబ్ లెస్ టైర్లు చుస్తుంటాము. మరోవైపు టైర్లు పూర్తిగా చెక్క, ఇనుముతో చేయబడిన విచిత్ర టైర్లు చూశాము. కానీ అందుకు భిన్నంగా ఓ టూ వీలర్ స్పోర్ట్స్ బైక్‌కు రంపం (బ్లేడ్)తో చక్రాల మాదిరి అమర్చి నడుపుతున్నారు. అవును మీరు విన్నది నిజమే రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్‌పై ఓ యువకుడు దూసుకుపోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంచు ప్రదేశాల్లో రెగ్యులర్ టైర్లు ఉన్న బైక్స్ వెళ్లాలంటే కొంత శ్రమతో కూడుకున్న పని, ఆ టైర్లు ముందుకు కదలదు, దీంతో ఆ టైర్లు మంచుపై జారిపోయి కింద పడ్డ ఘటనలు మనం ఎన్నో చూశాం. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడికి వినూత్న తీరులో ఓ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్ బైక్‌కు ఉన్న రెగ్యులర్ టైర్లను తీసేసి రంపం టైర్లు అమర్చాడు. అనంతరం ఆ బైక్‌తో మంచులో స్పీడ్‌గా రైడ్ చేస్తున్నాడు. మరోవైపు మట్టిపై కూడా ఈ బైక్ రైడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ బైక్ టైర్లతో పెద్ద పెద్ద చెట్ల మొద్దులను కూడా కట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రంపం టైర్ల స్పోర్ట్స్ బైక్ అని నెటిజన్లు ఆ బైక్‌కు పేరు పెట్టేశారు. అయితే కొంచెం ఏదైనా తేడా వస్తే మాత్రం ఆ రంపం టైర్ల కింద పడి నలిగి పోవాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.