దిశ, వెబ్ డెస్క్ : సెల్ఫీ పిచ్చి, రీల్స్ వెర్రి( Selfie madness) ఎందరివో ప్రాణాలు బలిగొంటున్నప్పటికి యువత(youth) మాత్రం వాటికి దూరంగా ఉండటం..లేక అప్రమత్తతో వ్యవహరించడం మాత్రం చేయడం లేదు. చెప్పాలంటే సెల్ఫీలను, రీల్స్ లను వ్యసనంగా మార్చుకుంటూ ప్రాణాల మీద(life threatening)కు తెచ్చుకుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకోగా ఓ యువతి అతి కష్టం మీద ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల హంస గౌడ(Hamsa Gowda) స్నేహితురాలితో కలిసి మందార గిరి హిల్స్ కు వెళ్ళింది. వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా..హంసగౌడ ప్రమాదవశాత్తూ నీటిలో పడి కొట్టుకుపోయింది. రెస్క్యూ సిబ్బంది దాదాపు 20 గంటల పాటు రెస్కూ ఆపరేషన్ నిర్వహించి హంస గౌడను కాపాడగలిగారు. అన్ని గంటల పాటు ఆమె జలపాతం నీటిలోనే బండరాళ్ల మధ్య బిక్కు బిక్కు మంటూ గడిపింది. ఆ సమయం తాను ప్రాణ భయంతో విలవిలాడిపోయాయని, సెల్ఫీ మోజులో పడి ఇలా ఎవరూ చేయొద్దని హంసగౌడ అనుభవం నేర్పిన గుణపాఠంతో అందరికి హితబోధ చేసింది.