మహిళ అఘోరి సంచలన నిర్ణయం.. రేపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ వద్ద ఆత్మార్మనకు సిద్ధం
సికింద్రబాద్(Secunderabad) ముత్యాలమ్మ ఆలయంలో దూరిన దుండగులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్: సికింద్రబాద్(Secunderabad) ముత్యాలమ్మ ఆలయంలో దూరిన దుండగులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ ఘటన అనంతరం.. ఉన్నట్టుండి ఓ మహిళా అఘోరి(Women Aghori) అమ్మవారి ఆలయంలో ప్రత్యక్షమై నగ్నంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె కూడా రాష్ట్ర మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజనేయస్వామని దర్శించుకు మహిళా అఘోరి (Women Aghori).. అనంతరం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మం కోసం రేపు తాను సికింద్రబాద్ లోని ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ( self-immolation) చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై కొండగట్టులో ఆమె మాట్లాడుతూ.. రేపు సికింద్రబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏమ జరుగబోతుందో చూడండంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంపై ఇటీవల దాడులు పెరిగిపోయాని.. అనేక మీడియా చానెళ్లతో చెప్పుకొచ్చిన ఆమె ఆత్మార్పణ( self-immolation) చేసుకుంటానని చెప్పడం సంచలనంగా మారింది. దీంతో రేప(గురువారం) సికింద్రబాద్ లో ఏం జరగబోతొందునని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.