మెట్రోలో శృంగారం! జంటలకు కేరాఫ్ అడ్రస్ ఢిల్లీ మెట్రో
ఢిల్లీ మెట్రో యువ ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. నిత్యం లక్షలాది మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మెట్రో యువ ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. నిత్యం లక్షలాది మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు. అయితే రద్దీని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమ జంటలు ఢిల్లీ మెట్రోలో రొమాన్స్, కిస్సింగ్ చేస్తుంటారు. ప్రేమ జంటలకు అది ఎంజాయ్‌గా ఉండొచ్చు కానీ.. తోటి ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరో ప్రేమ జంట మెట్రో స్టేషన్లో రోమాన్స్ చేస్తూ కనిపించారు. అందరూ చూస్తుండగానే ఓ జంట కౌగిలించుకొని, ముద్దులు పెట్టుకుంటున్నారు. తోటి ప్రయాణికుల్లో ఒకరు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయ్యింది.
ఢిల్లీ మెట్రో అధికారులకు నెటిజన్లు ఫిర్యాదు చేశారు. మరోవైపు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ గుడ్డిదని, అందుకే అందరూ ఉన్న కూడా జంటలు వారి పని వారు చేసుకుంటూ పోతుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రయాణికులు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ ఢిల్లీ మెట్రో సంస్థ పదే పదే కోరుతోంది. కానీ, కేసులు నమోదు చేయడం, తదితర కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రేమ జంటలు ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోతున్నారు.