అచ్చం మనిషిలాగే.. భాగస్వామి మృతితో బోరున ఏడ్చిన ఏనుగు(video viral)

మనుషుల్లాగానే ఏనుగుల్లోనూ అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయని ఈ వీడియో చూస్తుంటే అర్ధమవుతోంది...

Update: 2025-03-15 04:56 GMT
అచ్చం మనిషిలాగే.. భాగస్వామి మృతితో బోరున ఏడ్చిన ఏనుగు(video viral)
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మనుషుల్లాగానే ఏనుగుల్లోనూ అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయని ఈ వీడియో చూస్తుంటే అర్ధమవుతోంది. 25 ఏళ్ల భాగస్వామి చనిపోవడంతో ఏనుగు(Elephant) పడిన బాధ చూస్తుంటే ఎవరికైనా కళ్ల వెంట నీళ్లు రావాల్సిందే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జెన్నీ(Jenny), మాగ్డా(Magda) సర్కస్ ఏనుగులు రష్యా(Rashya)లో 25 సంవత్సరాలకు పైగా భాగస్వాములుగా ఉన్నాయి.


అయితే జెన్నీ మరణించింది. దీంతో జెన్నీ వద్దకు మాగ్డా ఏనుగును పంపించారు. ఈ మేరకు జెన్నీని పైకి లేపేందుకు మాగ్డా చాలా ప్రయత్నం చేసింది. తొండం పట్టుకుని పైకి లేపేందుకు యత్నించింది. అటు, ఇటు తరుపుతూ పైకి లే అంటూ దుంఖించింది. జెన్నీపై పడి రోదించింది. ఈ వీడియో పశు వైద్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచారం వ్యకం చేశారు. జెన్నీ కోసం మాగ్డా చేసిన ప్రయత్నాన్ని చూసి తాము కన్నీరు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News