Ambani's Anniversary: అంబానీ పెళ్లి వేడుకలో స్పెషల్ కేక్.. వీడియో వైరల్
ఈ రోజుల్లో సెలబ్రేషన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేక్స్ (Cakes).

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో సెలబ్రేషన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేక్స్ (Cakes). పుట్టిన రోజైనా, పెళ్లి రోజైనా.. అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఎక్కడైనా కేకు ఉండాల్సిందే. ఇక ప్రస్తుతం చాలా మంది సందర్భానికి తగ్గట్టుగా.. కావాల్సిన డిజైన్‌తో కేక్‌ను కస్టమైజ్ చేయించుకుంటున్నారు. అందులోనూ సెలబ్రెటీల (Celebrities) కోసం ప్రత్యేక థీమ్‌తో తయారుచేసిన కేకులు అయితే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ కేక్ నెట్టింట వైరల్‌గా మారింది. మరీ ఈ కేక్ ఎవరి కోసం తయారు చేశారు? ఈ కేక్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
మార్చి 8న ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త నీతా అంబానీ-ముఖేష్ అంబానీ (Nita Ambani-Mukesh Ambani) తమ 40వ పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రముఖ కేక్ డిజైనర్ బంటీ మహాజన్‌తో (Bunty Mahajan) 30 కిలోల ఆరంచెల స్పెషల్ కేక్‌ను డిజైన్ చేయించుకున్నారు. సాధారణంగానే అంబానీలకు జంతువులంటే ప్రేమ ఎక్కువ అని తెలిసిందే. అందుకే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వంతారా పేరుతో ఓ జంతు సంరక్షణ-పునరావాస కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు. దీని నిర్వహణ బాధ్యతల్ని అనంత్ అంబానీ చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తమ వివాహ వార్షికోత్సవం కోసం వంతారా థీమ్‌తో ప్రత్యేకమైన కేక్‌ను కస్టమైజ్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు.
కేక్ డిజైనర్ బంటీ మహాజన్.. యానిమల్ థీమ్ కేక్‌ను బేబీ పింక్, గోల్డ్ కలర్ రంగులతో ఎంతో అందంగా తయారుచేశారు. కేక్‌పై క్రీమ్‌తో పులులు, సింహాలు, ఏనుగులు, మొసళ్లు.. ఇలా విభిన్న జంతువుల బొమ్మల్ని తయారుచేసి ఒక్కో లేయర్‌పై అందంగా అమర్చారు. అడవిని ప్రతిబింబించేలా కొమ్మలు, ఆకులు, గడ్డి.. వంటి డిజైన్లతో ఒక్కో లేయర్‌పై అదనపు హంగులద్దారు. ఇక మధ్య లేయర్‌లో నీతా, ముకేశ్ పేర్లలోని మొదటి అక్షరాల్ని అందంగా తీర్చిదిద్దారు. కేక్ పైభాగంలో 'హ్యాపీ యానివర్సరీ డియర్ నీతా ముకేశ్' అనే కేక్ టాపర్‌ని ఉంచారు.
ఇక ఈ కేక్ చూడటానికే కాదు.. తయారీ కూడా ప్రత్యేకమైనది. దీని తయారీలో ఎలాంటి రసాయనాలు కలిపిన ఫుడ్ కలర్స్, ప్రాసెస్డ్ షుగర్ వంటివి ఉపయోగించలేదు. పూర్తిగా సహజసిద్ధంగా పండించిన పండ్లు, డ్రైఫ్రూట్స్‌ను ఉపయోగించి తయారుచేశారు. ఈ ప్రత్యేకమైన కేక్ వీడియోను తాజాగా బంటీ మహాజన్ ఇన్‌స్టాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది.
Read More..