వావ్.. వాటెన్ ఐడియా మేడం జి.. చల్లదనం కోసం ఏకంగా కారును అలా మార్చేసిన మహిళ
ప్రస్తుత కాలంలో టెక్నాలజీని ఎంతగా వాడుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. అయితే ఎంత టెక్నాలజీ వచ్చిన మన తాత ముత్తాతల సమయంలో పాటించే పద్ధతి వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలగకుండా చాలా హెల్తీగా ఉండేవారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో టెక్నాలజీని ఎంతగా వాడుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. అయితే ఎంత టెక్నాలజీ వచ్చిన మన తాత ముత్తాతల సమయంలో పాటించే పద్ధతి వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలగకుండా చాలా హెల్తీగా ఉండేవారు. ఇక ఇప్పుడు పాత కాలం పద్ధతులు ఎవరూ అనుసరించడం లేదనే చెప్పాలి. కానీ అహ్మదాబాద్‌కు చెందిన సెజల్ షా అనే మహిళ పర్యావరణానికి హాని కలగకుండా చేసిన వినూత్న ప్రయత్నం ఆమెను నెట్టింట ప్రశంసలతో ముంచెత్తుతుంది. భారతదేశంలోని అహ్మదాబాద్‌కు చెందిన సెజల్ షా అనే మహిళ వేసవిలో తన కారును చల్లగా ఉంచడానికి ఆవు పేడతో పూత పూసి వైరల్ అయ్యింది. అంతేకాకుండా ఇది ఎయిర్ కండిషనింగ్‌కు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం అని పేర్కొంది. మరి దాని వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం..
"కూలింగ్ హ్యాక్":
అహ్మదాబాద్‌కు చెందిన సెజల్ షా అనే మహిళ తన కారు వేడెక్కకుండా ఉండటానికి, కిటికీలు దించి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చల్లగా ఉండటానికి ఆవు పేడతో మొత్తం కారుకు కోటింగ్ వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు పర్యావరణానికి హానికరం చేయకుండా ఉన్న మీ ఐడియా సూపర్, వాటెన్ ఐడియా మేడం జి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఆమె అలా చేయడానికి గల కారణం:
భారతదేశంలోని అనేక ప్రాంతాల మాదిరిగానే అహ్మదాబాద్‌లో కూడా తీవ్రమైన వేడి, ఎండలు ఉంటాయి. అలా అక్కడ తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో వినూత్నంగా ఆలోచించిన ఆ మహిళ ఎయిర్ కండిషనింగ్ పర్యావరణానికి హానికరం కావున దానిని వాడకుండా ఉండాలనుకుంటున్నదట. అలాగే ఎయిర్ కండిషనింగ్ లేకపోయినా ఆవు పేడ పూత తన కారును చల్లగా ఉంచుతుందని సెజల్ షా చెబుతున్నారు.
Read More..
విద్యార్థులకు అలర్ట్.. కెనడాలో చదువుకోవడం పెద్ద స్కామ్.. రెడ్డీట్ పోస్టు వైరల్