Pan masala : ప్రైవేట్ జెట్‌ను ఆటోగా మార్చారు.. కదరా! విమానం డోర్ వద్ద గుట్కా తింటున్న వ్యక్తి.. వీడియో వైరల్

పాన్ పరాగ్, గుట్కా, విమల్, ఖైని నమిలే అలవాటు చాలా మందికి ఉంటుంది. బస్సులు, రైళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో గుట్కా నములుతూ.. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతారు.

Update: 2024-08-23 14:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాన్ పరాగ్, గుట్కా, విమల్, ఖైని నమిలే అలవాటు చాలా మందికి ఉంటుంది. బస్సులు, రైళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో గుట్కా నములుతూ.. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతారు. అయితే విమానంలో కూడా గుట్కా నమిలేవాళ్లను చూశారా? దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి ప్రైవేట్ జెట్ డోర్ వద్ద నిలబడి ఖైనీ లాంటి పదార్థం తన చేతితో బాగా రుద్దుతున్నాడు.

తర్వాత దాన్ని ఇంకో చేతిలోకి తీసుకుని చిటికెడు నోటిలో నొక్కి పెట్టుకుంటున్నాడు. ఇదంతా కూడా ఫ్లైట్ సిబ్బంది ముందే నోటిలో పెట్టుకొని నములుతున్నాడు. ఈ తతంగమంతా ఓ వ్యక్తి రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. విమానం ఎక్కిన వీధిలో అయినా విదేశాల్లో అయినా ఈ గుట్కా బ్యాచ్ మారరు అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. చక్కటి ప్రైవేట్ జెట్‌ను ఆటోగా, లోకల్ ట్రైన్ మాదిరి మార్చారు కదరా.. అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News