Smart Idea: ఫిజిక్స్ టీచరమ్మ కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్.. పెట్టుకోకుంటే బండి స్టార్ట్ కాదట

Physics teacher's smart idea: బైక్ నడుపుతున్న వారంతా హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

Update: 2025-03-18 07:36 GMT
Smart Idea: ఫిజిక్స్ టీచరమ్మ కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్.. పెట్టుకోకుంటే బండి స్టార్ట్ కాదట
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Physics teacher's smart idea: బైక్ నడుపుతున్న వారంతా హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. మరికొందరు వాటిని ధరించినా బైక్ కు లాక్ చేయడం లో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొందరు హెల్మెట్ ధరించకుండానే డ్రైవ్ చేస్తుంటారు. పోలీసులు తనిఖీల్లో పట్టుబడిన ఫైన్ కట్టేస్తుంటారు.

తర్వాత కూడా మళ్లీ అదే పనిచేస్తుంటారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో..పర్యావసనంగా వారి కుటుంబాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోరు. తన భర్తకు యాక్సిడెంట్ అయి గాయాలతో బయటపడటంతో ఓ టీచరమ్మ ఇలాంటి పరిస్థితి మళ్లీ తన భర్తకు రాకూడదని స్మార్ట్ ఆలోచన చేసింది.అద్బుతమైన హెల్మెట్ తయారు చేసింది. ఈ ఫిజిక్స్ టీచరమ్మ తయారుచేసిన హెల్మెట్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం.

ఈ హెల్మెట్ వాహనదారుడిని అలర్ట్ చేస్తుందంట. ఎలా అంటే హెల్మెట్ పెట్టుకోకుంటే ఆ బైక్ స్టార్ట్ కాదట. అలాగే మద్యం సేవించి డ్రైవ్ చేయాలని ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాదట. అంతేకాదు ఎప్పుడైనా వాహనదారుడికి ప్రమాదం జరిగిన వెంటనే సహాయం కోసం పోలీసులకు మెసేజ్ వెళ్తుందట. దీనికోసం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ హెల్మెట్ ను తయారు చేశారు. టెక్నాలజీని చక్కగా ఉపయోగించారు.

 

ఈ టీచర్ పేరు విజయ భార్గవి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని రేకులకుంట గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. తన భర్త హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ ప్రమాదానికి గురై చిన్న గాయలతోనే బయటపడటంతో తనకు ఈ ఆలోచన వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ టీచరమ్మ తయారుచేసిన హెల్మెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలమ్మా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా..సూపర్ సూపర్ సూపర్...ఇప్పటివరకు ఏ కంపెనీ ఇవ్వలేదు ఇలాంటి ఫెసిలిటీస్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. 

Tags:    

Similar News