ఇండిగో విమానంలోని శాండ్విచ్లో నట్, బోల్ట్ ప్రత్యక్షం.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
సాధారణంగా శాండ్విచ్లో ఏముంటాయని మీరు అనుకుంటున్నారు. మనకు ఉన్న అవగాహన ప్రకారం.. రెండు బ్రెడ్ ముక్కల మధ్య కీరా, టొమాటో, చీజ్, బ్లాక్ పెప్పర్ ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా శాండ్విచ్లో ఏముంటాయని మీరు అనుకుంటున్నారు. మనకు ఉన్న అవగాహన ప్రకారం.. రెండు బ్రెడ్ ముక్కల మధ్య కీరా, టొమాటో, చీజ్, బ్లాక్ పెప్పర్ ఉంటాయి. కానీ, ఇండిగో ఫ్లయిట్లో ఇచ్చిన శాండ్విచ్లో ఇనుప నట్, బోల్ట్‌ని వాడారు. వివరాల్లోకి వెళితే.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఫ్లైట్ అసిస్టెంట్స్ శాండ్విచ్ సెర్వ్ చేశారు. దీంతో ఆ శాండ్విచ్ తినడం ప్రారంభించిన అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఏంటంటారా.. ఓ పెద్ద ఇనుప నట్, బోల్ట్ శాండ్విచ్లో ప్రత్యక్షమైంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఫొటోను రెడిట్ యూజర్ 'MacaroonIll3601' తన ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ విషయంలో స్పందించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ శాండివిచ్ సర్వ్ చేస్తున్నప్పుడు తాము సరిగ్గా చూడలేకపోయాని, కలిగిన అసౌకర్యానికి ఫ్లైట్ సిబ్బంది సదరు ప్రయాణికుడికి క్షమాపణ చెప్పారు.