ఆకాశంలో అద్భుతం.. ఒకేసారి దర్శనం ఇచ్చిన ఏడుగురు సూర్యులు షాకింగ్ వీడియో
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచ నలుమూలల ఎక్కడ ఎలాంటి సంఘటన చోటుచేసుకున్నా.. కొందరు వీడియోలో బంధించిన నెట్టింట షేర్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని ఎక్కడ ఏం జరిగినా తొందరగా తెలుసుకునే టెక్నాలజీ రావడంతో అందరూ అప్డేట్ అయ్యారు. ప్రతీ దాన్ని వీడియో చేసి నెట్టింట పెట్టేస్తున్నారు. అయితే కొన్ని సంఘటనలు చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట మాత్రం ఫుల్ వైరల్ అయిపోతున్నాయి.
అయితే ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వీక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా అన్ని చోట్ల ఒకే సూర్యుడు కనిపిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, చైనాలో మాత్రం ఒకేసారి ఏకంగా ఏడు సూర్యులు దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. చైనాలోని సిచువాన్‌లో ఆకాశంలో ఏడు సూర్యులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 19న సోమవారం నాడు ఈ అద్భుత ఘట్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా వావ్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు.