ఇలా ఉన్నావేంట్రా? స్కామర్‌నే స్కాం చేసిన యువకుడు.. 3 సార్లు పైసా వసూల్

స్కామర్‌నే స్కాం చేసి చుక్కలు చూపించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Update: 2025-03-17 11:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: (scammer) స్కామర్‌నే స్కాం చేసి చుక్కలు చూపించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. (Kanpur) కాన్పుర్‌లో భూపేంద్ర సింగ్ అనే యువకుడికి తాను సీబీఐ అధికారిగా నటిస్తూ, నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయి కేసు క్లోజ్ చేయాలంటే రూ.16 వేలు ఇవ్వాలని ఓ స్కామర్ కాల్ చేశాడు. స్కామర్ కాల్ అని గమనించిన యువకుడు అతనిని ఒక ఆట ఆడుకోవాలని భావించాడు. ప్లీజ్ ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పొద్దు. మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతానంటూ భయపడినట్లు యువకుడు సైతం నటించాడు. దీంతో నమ్మిన స్కామర్ డబ్బులు ఇవ్వుమని అన్నాడు. భూపేంద్ర సింగ్ తాను ఒక బంగారు గొలుసు తాకట్టు పెట్టానని దాన్ని విడిపించడానికి రూ. 3వేలు కావాలని, ఆ గొలుసును విడిపించి తనకు డబ్బులిస్తానని నమ్మించాడు.

యువకుడి మాటలు నమ్మిన సైబర్ నేరగాడు ముందుగా రూ.3వేలు ఇవ్వగా, తర్వాత తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి ఆ గొలుసు ఇవ్వడం లేదని, మీరు నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలని చెప్పాడు. దానికి ఆ స్కామర్ ఒప్పుకున్నాడు. యువకుడు నగల వ్యాపారిగా తన స్నేహితుడిని నటించమని చెప్పాడు. తర్వాత ఫోన్ మాట్లాడిన స్కామర్‌ను మరో రూ.4,480 కడితే లోన్ క్లియర్ అవుద్దని, తర్వాత ఆ గొలుసుపై రూ.1.10 లక్షల రుణం ఇస్తానని దానికి రూ.3 వేలు ప్రాసెస్ ఫీజు అవుద్దని మొత్తం రూ.10వేలు స్కామర్ వద్ద వసూల్ చేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన స్కామర్ తన డబ్బులు ఇవ్వాలని బ్రతిమాలాగా, భూపేంద్ర సింగ్ జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేసి, రూ.10 వేలను విరాళంగా ఇస్తానని చెప్పుకొచ్చాడు. స్కామర్‌నే స్కాం చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా ఉన్నావేంట్రా? తెలివిగా మోసం చేయడం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More..

5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ 2025 ప్రకటించిన DoT 

Tags:    

Similar News