చూడ్డానికి అది పెంకుటిల్లే.. కానీ లోపలికి వెళ్లి చూస్తే మతిపోవాల్సిందే!
అనాటి కాలంలో కుటుంబ గౌరవానికి ప్రతీక మండువా లోగిలి.
దిశ,వెబ్‌డెస్క్: అనాటి కాలంలో కుటుంబ గౌరవానికి ప్రతీక మండువా లోగిలి. ఆ కుటుంబంలోని సభ్యులు ఎంతో సఖ్యతగా ఉండేవారు. దీంతో సమాజంలో కూడా మంచి గౌరవం ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనమే పెంకుటిల్లు. గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండే వాటి నిర్మాణాలు, విశాలమైన గదులు, చుట్టూ చెట్లు ఎంతో అబ్బురపరుస్తాయి. అంతేకాదు పచ్చని పంట చేలు, కాలువలతో కళకళలాడే పల్లెలకు ఈ పెంకుటిల్లులు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తర్వాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లో కూడా కాంక్రీట్ భవనాల నిర్మాణం పెరిగింది.
దీంతో చాలా వరకు పల్లెల్లో పెంకుటిల్లులు కనుమరుగవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పెంకుటిల్లులు మనకు కనిపిస్తుండటం గమనిస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పల్లెటూరిలో సిటీ కల్చర్ చూడాలనుకున్నాడో వ్యక్తి. ఇంకేముంది తన పెంకుటిల్లును ఫైవ్ స్టార్ హోటల్‌గా మార్చేశాడు. బయటకు అది పెంకుటిల్లులా కనిపించిన లోపలికి వెళ్లి చూసినవారు నోరెళ్లబెట్టాల్సిందే. అంత అందం(Beautiful)గా దీనిని మార్చేశాడు మరి. ఇంటి లోపల టైల్స్(Tiles), కబోర్డ్స్(cupboards), పెద్ద టీవి(large TV) యూనిట్, బెడ్‌రూమ్(bedroom), మోడ్రన్ కిచెన్‌తో(modern kitchen) పాటు బాతురూమ్‌తో ఉన్న ఈ పెంకుటిల్లు వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.