Viral video: ఇది కదా.. మత సామరస్యం అంటే.. హిందూ భక్తులకు ఈ ముస్లిం చేస్తున్న సాయం చూడండి!
'హిందూ-ముస్లిం.. భాయీ భాయీ' అనేది మన దేశంలో నానుడి.

దిశ, వెబ్ డెస్క్: 'హిందూ-ముస్లిం.. భాయీ భాయీ' అనేది మన దేశంలో నానుడి. అంటే.. హిందువులు, ముస్లింలు సోదర భావంతో కలిసి సఖ్యాతగా ఉండాలని అర్థం. ఇక మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఎన్నో సంఘటనలనూ కూడా తరచూ చూస్తుంటాం. తాజాగా తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. హిందూ భక్తుల కోసం ఓ ముస్లిం చేసిన సాయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆ ముస్లింపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎల్లప్పుడూ హిందూ-ముస్లింలు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇలానే అండగా ఉంటే సమాజంలో సంఘర్షణలకు చోటు ఉండదని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న సమాచార ప్రకారం.. తమిళనాడు శివగంగ జిల్లాలోని మీనాక్షిపురం ముత్తుమారి అమ్మన్ ఆలయంలో తాజాగా 'పంగుని పాల కుడం' వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు పాల కుండలను తలపై మోసుకుని నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి వాటిని సమర్పించి, పూజలు నిర్వహిస్తారు. అయితే, ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటంతో.. భక్తులకు ఎండ తాపం నుంచి కొంత ఉపశమనం కల్పించేందుకు ఓ ముస్లిం వ్యక్తి దారిలో వారి కోసం నీరు పడుతూ నిల్చున్నాడు. స్థానికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.