Instagram: తల్లీ, కొడుకు అసభ్యకర వీడియో వైరల్.. ఇన్‌స్టాగ్రామ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఇన్‌స్టాగ్రామ్.. దేశంలో వయసుతో సంబంధం లేకుండా వాడుతున్న ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఇందులో ముఖ్యంగా రీల్స్ చేస్తూ.. కుర్రకారు కొత్తపుంతలు తొక్కుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్.. దేశంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుతున్న ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం. ఇందులో ముఖ్యంగా రీల్స్ చేస్తూ.. కుర్రకారు కొత్తపుంతలు తొక్కుతోంది. అభ్యకరమైన వీడియోలు, జుగుప్సాకరమైన కంటెంట్ మానవ సంబంధాలను సైతం మలినం చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ తల్లీ, కొడుకు చేసిన అడల్ట్ కంటెంట్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌పై పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఆదేశాల మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. అనంతరం అమెరికాలోని మెటా కార్యాలయానికి సైతం లీగల్ నోటీసులు పంపారు. అయితే, ఆ వీడియోలో ఓ తల్లీ, కొడుకు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దీనాజ్‌పూర్ నుంచి ఆ వీడియో అప్‌లోడ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీడియో ప్రమోట్ చేసిన యూట్యూబ్‌పై కూడా మహారాష్ట్రలో కేసు నమోదు కావడం విశేషం.