Viral Video : ‘రీల్స్’ మాయలో మానవత్వం మరిచి.. ఫోమ్ స్ప్రే‌తో వికృత చేష్టలు!

సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు.

Update: 2024-09-22 08:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవ్వడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. లైకులు, ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు ఇన్‌స్టా రీల్స్ మాయలో పడి మానవత్వాన్ని మరుస్తున్నారు. ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై స్నో ఫోమ్ స్ప్రే కొడుతూ ఆకతాయిలు వీడియో తీశారు. సైకిల్‌పై తొక్కుకుంటూ వస్తున్న వ్యక్తిపై ఫోమ్ స్ప్రే చేయడంతో అతని ముఖం మొత్తం ఫోమ్‌తో నిండిపోయి ఉంటుంది. అతను దీన స్థితిలో ఉన్నట్లు వీడియోలో కన్పిస్తుంటాడు. రీల్ చేసిన ఆకతాయిలు మాత్రం బైక్ వచ్చి అతనిపై ఫోమ్ కొట్టి నవ్వుతూ ఎంజాయ్‌గా తమ దారిలో వెళ్లిపోతారు.

ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా పరిధిలో జరిగినట్లు ప్రియా సింగ్ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా ఝాన్సీ పోలీసులు స్పందించారు. ఈ వీడియోపై ఇన్వెస్టిగేషన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య రీల్స్ మాయలో పడి మానవత్వం సైతం మరిచిపోతున్నారని, సీనియర్ సిటిజన్‌పై ఫోమ్ స్ప్రే కొడుతూ వికృత చేష్టలు చేయడం నీచం? ఇలాంటి వారిని వదిలి పెట్టవద్దని కామెంట్స్ చేస్తున్నారు.


Similar News