ఈ పిట్ట గుడ్లు పెట్టిందంటే.. వానలు మొదలైనట్లే..

నార్త్ ఇండియా అధిక ఉష్ణోగ్రతలతో భగ భగ మండిపోతోంది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్ లో టెంపరేచర్ 50 డిగ్రీలు దాటింది. వానలు ఎప్పుడు కురుస్తాయా.. ఎప్పుడు ఈ ఎండ నుంచి ఉపశమనం పొందాలా అని

Update: 2024-05-30 08:41 GMT

దిశ, ఫీచర్స్: నార్త్ ఇండియా అధిక ఉష్ణోగ్రతలతో భగ భగ మండిపోతోంది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్ లో టెంపరేచర్ 50 డిగ్రీలు దాటింది. వానలు ఎప్పుడు కురుస్తాయా.. ఎప్పుడు ఈ ఎండ నుంచి ఉపశమనం పొందాలా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. అయితే రాజస్థాన్ లోని గ్రామాల్లో ఓ నమ్మకం ప్రబలంగా ఉంది. టిటహరి లేదా టిటువు పిట్ట గుడ్లు పెట్టడాన్ని బట్టి ఈ ఏడాది ఋతుపవనాలు ఎలా ఉండబోతున్నాయని నిర్ధారిస్తారు.

ఈ రెడ్-వాటిల్ లాప్‌వింగ్ బర్డ్ ఎత్తైన ప్రదేశంలో గుడ్లు పెడితే వర్షాకాలం స్టార్ట్ అయినట్లే అని నమ్ముతారు. ఇక మాల్వాలోని ఆదివాసీ తెగలు అయిన భిల్లులు ఎండిపోయిన ప్రవాహాలలో పెట్టిన గుడ్లు వర్షాల ఆలస్యం లేదా కరువుకు ముందస్తు హెచ్చరికగా భావిస్తారు. ఒకవేళ నది ఒడ్డున గుడ్లు పెడితే సాధారణ వర్షాలకు సూచనగా.. ఆరుకు పైగా గుడ్లు పెడితే సమృద్ధిగా పంటలు పండుతాయని, శుభ సూచకమని పరిగణిస్తారు.

కాగా ఈ పక్షులు గడ్డి భూములు, చిన్న రాళ్లు, ఎడారుల్లో భవనాలు, పైకప్పులపై గూళ్లు పెట్టుకుంటాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దాదాపు నాలుగు నుంచి ఆరు గుడ్లు పెడుతాయి. ఇక మానవ లేదా జంతువుల కదలికల గురించి తోటి పక్షులకు సిగ్నల్ ఇచ్చేందుకు బిగ్గరగా అలారంలా అరుస్తాయి.


Similar News