Girl Friend For Rent : అద్దెకు లవర్.. నన్ను బుక్ చేసుకోండంటూ కుర్రాళ్లకు అమ్మాయి బంపర్ ఆఫర్

భారతదేశం మారిపోతుంది. బంధాల విషయంలో ఒకప్పుడు ఇండియాను చూసి ఇతర దేశాలు నేర్చుకునేవి కానీ ఇప్పుడు రిలేషన్స్ ఇక్కడ కూడా కరప్ట్

Update: 2024-05-30 07:25 GMT

దిశ, ఫీచర్స్: భారతదేశం మారిపోతుంది. బంధాల విషయంలో ఒకప్పుడు ఇండియాను చూసి ఇతర దేశాలు నేర్చుకునేవి కానీ ఇప్పుడు రిలేషన్స్ ఇక్కడ కూడా కరప్ట్ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు.. ఎవరికి ఏ టైమ్ లో హ్యాండ్ ఇస్తున్నారు తెలియట్లేదు. మొత్తానికి బంధాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ' గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్ ' బిజినెస్ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది. నిజానికి ఫారిన్ లో ఒక్కరోజు అక్క, చెల్లి, తండ్రి, తల్లి.. ఇలా ప్రతి పాత్రను అద్దెకు తీసుకోవచ్చు. డబ్బులు చెల్లించి వారితో ఆ బంధాన్ని ఎన్ని రోజులు బుక్ చేసుకుంటారో అన్ని రోజులు ఆస్వాదించవచ్చు. అయితే ఇదంతా కొన్ని కంపెనీలు చేస్తుంటాయి. కానీ ఇక్కడ కొత్తగా దేవ గిరి అనే అమ్మాయి కుర్రాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చింది. తనను లవర్ గా బుక్ చేసుకోమని ప్రకటించిన ఆమె.. ఒక్కరోజుకి దేనికి ఎంత చెల్లించాలో కూడా లిస్ట్ రిలీజ్ చేసింది.

  • కాఫీ డేట్                         రూ. 1500
  • డిన్నర్ డేట్                    రూ. 2000
  • ఫ్యామిలీ డేట్                  రూ. 3000
  • ఈవెంట్ ప్రోగ్రామ్           రూ. 3500
  • హోమ్ ఫుడ్ డేట్            రూ. 3500
  • బైక్ డేట్.                        రూ. 4000
  • షాపింగ్ ప్రోగ్రామ్            రూ. 4500
  • గర్ల్ ఫ్రెండ్ పోస్ట్             రూ. 6000
  • అడ్వెంచర్స్                 రూ. 5000
  • వీకెండ్ గెట్ అవే            రూ. 10000

Similar News