Viral: అమ్మాయిలు బైక్ నడుపుతున్నారా.. జాగ్రత్తగా లేకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే! (వీడియో)
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటుగా.. పురుషులు చేసే పనులు కూడా చేస్తూ ఎంతో మంది మెప్పు పొందుతున్నారు.
దిశ,ఫీచర్స్: ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటుగా.. పురుషులు చేసే పనులు కూడా చేస్తూ ఎంతో మంది మెప్పు పొందుతున్నారు. అయితే కొందమంది స్కూటీలే కాకుండా కారు, బైకులు నడుపుతూ తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా బైక్‌పై ఎంత దూరం అయినా వెళుతున్నారు. కానీ కొంతమంది అజాగ్రత్తగా ఉండటం వల్ల పలు యాక్సిడెంట్లు కూడా అవుతున్న సంగతి తెలిసిందే. కొందరు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు వేరేవాళ్లు నడిపినప్పటికీ మహిళలు వెనకాల కూర్చోవడంతో వారి చున్నీ, లేదా చీర కొంగు పడటం వల్ల కూడా ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా, ఓ షాకింగ్ వీడియో అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఓ యువతి అప్రమత్తం అవడం వల్ల తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకుంది.
అసలు వీడియోలో ఏముందంటే.. సునీతా మనోహర్ అనే యువతి ముంబైలోని ప్రదేశాల్లో తన ఫ్రెండ్‌తో కలిసి బైక్ రైడ్‌కు వెళ్లింది. హెల్మెట్ పెట్టుకొని మెల్లగా వెళ్తుండగా.. ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. చున్నీ బైక్ చైన్ బాక్స్‌లో ఇరుక్కోవడంతో ఒక్కసారిగా ఆమె తలను కిందకు లాగేసింది. దీంతో ఆమె అప్రమత్తం అయి హటాత్తుగా బైక్‌ను ఆపేసింది. కింద పడబోతుండగా.. అది గమనించిన స్థానికులు వచ్చి కాపాడారు. అయినప్పటికీ యువతి మెడకు గాయం అయింది.
ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నేను మెల్లగా బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా నా దుపట్టా చైన్‌లో చిక్కుకుని మెడకు చిన్న గాయమైంది. నాకు వెంటనే సహాయం చేసిన వ్యక్తులకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఒక హెచ్చరిక: మీరు రైడర్ అయినా లేదా పిలియన్ అయినా రైడింగ్ చేసేటప్పుడు దుపట్టా ధరించకుండా ఉండండి. దయచేసి సురక్షితంగా ఉండండి... ఈసారి నేను అదృష్టవంతురాలిని కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను’’ అని రాసుకొచ్చింది.
(Video Link Credits to nusti bhatkantii Instagram Channel)