ప్రాణం పోయేంత పని చేసిన సెల్ ఫోన్.. రైలులో బాలిక వీడియో వైరల్

చిన్న పిల్లల నుంచి పెద్ద వరకూ సెల్ ఫోన్ పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది...

Update: 2025-01-17 03:11 GMT
ప్రాణం పోయేంత పని చేసిన సెల్ ఫోన్.. రైలులో బాలిక వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ సెల్ ఫోన్(Cell Phone) పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరింది. సెల్ ఫోన్ చూడకపోతే బతకలేమన్నంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇంట, బయట చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. వీడియోలు, కామెడీ సీన్స్ చూడాల్సిందే. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయడం లేదు. అన్నం తిన్నాలన్నా, నిద్ర పోవాలన్నా దగ్గర ఫోన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు(Parents) బీజీగా ఉండటంతో కొంచెం సేపు సెల్ ఫోన్ ఇస్తే పిల్లలు చూస్తారులే అనుకుంటే కానీ వాళ్లు మాత్రం  పూర్తిగా ఎడిక్ట్ అయిపోతున్నారు. జర్నీ సమయంలోనూ సెల్ ఫోన్‌ను వదలడంలేదు. గమ్యం చేరే వరకూ  సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 


అయితే ఓ చోట జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ అందరినీ నవ్వించింది. అందరిలా ఓ కుటుంబం రైల్లో జర్నీ చేసింది. అయితే వాళ్ల కూతురు ఫోన్ తీసుకుంది. ఎంతకీ తిరిగి ఇవ్వడం లేదు. రాత్రి సమయంలోనూ బాలిక(Girl) ఫోన్ చూస్తేనే ఉంది.  రైలు ఓ రైల్వే స్టేషన్‌(Railway Station)లో ఆగింది. దీంతో బాలిక చేతులో ఉన్న సెల్ ఫోన్‌ను రైలు కిటికీలో నుంచి ఓ దొంగ(Thief) లాక్కెళ్లారు. అయితే బాలిక తన చేతిలోని సెల్ ఫోన్ ను తీసుకెళ్లకుండా చేసేందుకు చాలా ప్రయత్నం చేసింది. మమ్మీ... దొంగ ఫోన్ ఎత్తు కెళ్తున్నాడు అంటూ అరిసింది. కానీ ఫోన్‌ను దొంగ తీసుకెళ్లిపోయారు. 


అయితే ఇదంతా తల్లిదండ్రులే చేయించడంతో ప్రయాణికులు నవ్వుకున్నారు. రైలు ఎక్కినప్పటి నుంచి బాలిక సెల్ ఫోన్ చూస్తుండటం, ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో చిరాకు పడిన పేరెంట్స్.. సరదాగా ఈ ఐడియాను అమలు చేశారు. బాలిక సెల్ ఫోన్‌ను కిటికీలోంచి లాక్కెళ్లమని చెప్పడంతో చోటి ప్రయాణికుడు అలానే చేశారు.  కానీ సెల్ ఫోన్‌పై చిన్నారికున్న మక్కువ ఏందో ఈ ఘటనతో అర్ధమైంది. ఫన్నీగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెల్ ఫోన్ మితంగా చూడాలని.. ఎక్కువగా చూస్తే బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు ఇప్పటికైనా సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని కోరుకుందాం. బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం.

Full View

Tags:    

Similar News