మూడు కాళ్ల కుక్క..నదిలో దూకి, ఇలా చేసింది..?! (వీడియో)
మనుషుల కంటే జంతువులే ఎంతో నిస్వార్థమైనవని అనిపిస్తాయి. Three-Legged Dog Extraordinarily Saves A Baby Otter.
దిశ, వెబ్‌డెస్క్ః కళ్లముందే ఏవరైనా ప్రమాదంలో ఉంటే చాలా మంది పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఈ విషయంలో ఒక్కోసారి మానవత్వంలేని మనుషుల కంటే జంతువులే ఎంతో నిస్వార్థమైనవని అనిపిస్తాయి. ఇలాంటిదే ఓ సంఘటన అమెరికాలో వైరల్ అవుతోంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న మూడు కాళ్ల కుక్క ఓ జీవిని కాపాడటానికి పెద్ద సాహసమే చేసింది. మిన్నెసోటాలోని లేక్‌ల్యాండ్‌లోని సెయింట్ క్రోయిక్స్ నదిలో కొట్టుకుపోతున్న రోజుల వయసున్న ఓటర్ పిల్లను ఈ కుక్క రక్షించింది. వివరాల్లోకి వెళితే..
ఆరేళ్ల గోల్డెన్ డూడిల్, గుస్‌కు ఇటీవలే క్యాన్సర్ అని తేలింది. ప్రస్తుతం కీమో థెరపీ తీసుకుంటున్న గుస్‌కి ఒక కాలు తీసేశారు. అయితే, ఆ రోజు గుస్ కేవలం మూడు కాళ్లతో ఈత కొడుతున్న దృశ్యన్ని చూసి యజమాని క్లియో యంగ్ ఆశ్చర్యపోయారు. కొంతసేపటికి ఈ కుక్క ఒక ఓటర్‌ని నోటితో కరుచుకొని తన యజమాని, అతని మనుమరాళ్లు ఎల్లా, లూసీ దగ్గరకు తీసుకొచ్చింది. గుస్‌కి ఒక కాలు తీసేసినప్పటి నుంచి అది కాస్త దిగాలుగా ఉంటున్న విషయం వీళ్లు గమనించారు. 'మూడు కాళ్లతో అది కష్టంగానే నడవడం నేర్చుకుంది. కానీ, ఒక ప్రాణాన్ని కాపాడటానికి మూడు కాళ్లున్న సంగతి మరిచిపోయి, నదిలోకి దూకడంతో ఇప్పుడది హీరోగా మారింది' అని ఆ కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. ఇక, గుస్ కాపాడిని ఓటర్ తల్లి కోసం కొంతసేపు వెతికినా కనిపించకపోవడంతో ఓటర్‌ను శుభ్రం చేసి వన్యప్రాణుల పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రంలోని సిబ్బంది ఓటర్‌ను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చారు. గుస్ ఓటర్‌ని బయటకు తీసుకురాకపోతే అది బతికేది కాదని వైద్యులు చెప్పడంతో అందరి హృదయాలు చలించాయి.