తన తొండం చూసి షాకైన ఏనుగు పిల్ల.. ఏం చేసిందంటే?(వీడియో)

సోషల్ మీడియా వచ్చాక వింతలు, వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఎక్కడ ఏ చిన్న వింత సంఘటన జరిగినా సరే, ఇట్టే మనముందుకు వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా ట్విట్టర్‌లోఅన్న

Update: 2023-04-10 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు, వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఎక్కడ ఏ చిన్న వింత సంఘటన జరిగినా సరే, ఇట్టే మనముందుకు వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా ట్విట్టర్‌లోఅన్న అన్న పేరున్న యూజర్ పోస్ట్ చేసిన వీడియో అందరి నోట నవ్వులు పూయిస్తుంది.

ఇంతకీ అదేం వీడియో అనుకుంటున్నారా.. చిన్న క్యూట్ ఏనుగు పిల్ల, తన తొండెం చూసే తానే భయపడిపోయి ఆగం అవుతున్న వీడియో..అయితే ఓ పిల్ల ఏనుగు, తన తల్లితో కలిసి ఉంది.అయితే అది తన ముఖానికి వేలాడుతున్న చిన్న తొండాన్ని చూసి గందరగోళానికి గురి అవుతుంది. ఇది నాతొండమేనా.. ఇది ఇలా ఉంది ఏంటని భయపడి పోయి, దాన్ని కాలితో తొక్కడం, నేలకు వేయడం లాంటి చిన్న చిన్న అల్లరి చేష్టలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అల్లరి పిల్ల ఏనుగు చేష్టలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు ఆ వీడియోను చూసి, నవ్వుకోండి.

ఏప్రిల్-10: అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం

Tags:    

Similar News