నంబర్ ప్లేట్ లేని బైక్ పై ఆంటీ ముద్దులాట.. వైరలవుతోన్న వీడియో..!
ఇటీవల చిన్నా పెద్దా అని తేడా లేకుండా సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకోవడానికి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు.
దిశ, ఫీచర్స్: ఇటీవల చిన్నా పెద్దా అని తేడా లేకుండా సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకోవడానికి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. రకరకాల వీడియో చేస్తూ రాత్రికి రాత్రే విపరీతంగా ఫేమస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు వింతైన స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. ఇటీవల మెట్రో రైళ్లలో, అలాగే యువత బైక్ పై చేసే రొమాంటిక్ స్టంట్లు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ మహిళ కదులుతున్న బైక్‌పై బాటసారులకు ఎదురుగా కూర్చుని, ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియోలో ఓ బైక్‌పై ఒక మహిళ కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న విధానం కూడా భిన్నంగానే ఉంది. అలాగే నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెనుకకు తిరిగి కూర్చుంది. రోడ్డుకు ఎదురుగా బైక్‌పై కూర్చున్న మహిళ తన వెనుక వస్తున్న మరో బైకర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం కనిపించింది. దీంతో అవతలి వ్యక్తి కూడా మహిళ ఫ్లయింగ్ కిస్కు.. స్పందించాడు. ఆ వ్యక్తి సైగలు చేస్తూ తన బైక్‌పై కూర్చోమని ఆమెను అడిగాడు. కూర్చొనని ఆ మహిళ సైగలతో కొట్టిపారేసింది. అయితే మహిళ కూర్చున్న బైక్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడంతో పాటు మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిన మరో వ్యక్తి బైక్‌కు కూడా నంబర్ ప్లేట్ లేదు.
ముగ్గురిలో ఎవరూ హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ వీక్షించినా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంటీ కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరో వ్యక్తి స్పందిస్తూ.. ఇక్కడ యువతి చేసిన పని.. ఒక అబ్బాయి చేస్తే మాత్రం అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యేవని, కానీ ఇక్కడ యువతి కావటంతో ఎలాంటి కేసులు ఉండవు. పోలీసులు కనీసం ఆమెకు చలాన్ వేయాలని కామెంట్ చేశాడు. ఈ వీడియోను బీహార్ పోలీసులకు, పాట్నా పోలీసులకు ట్యాగ్ చేశాడు.