M K Stalin : తమిళనాడులో మళ్లీ హిందీ భాషా వివాదం.. ఎల్ఐసీపై సీఎం స్టాలిన్ ట్వీట్ వైరల్

తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ హిందీ భాష వివాదాన్ని రేపింది. హిందీలో ఎల్ఐసీ వెబ్‌సైట్‌ తేవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-11-19 10:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ హిందీ (Hindi) భాష వివాదాన్ని రేపింది. హిందీలో ఎల్ఐసీ వెబ్‌సైట్‌ తేవడంపై (Tamil Nadu) తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (M K Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్‌ భాషను ఎంచుకునేందుకు కూడా ఆప్షన్‌ హిందీలో ఉండటంపై సీఎం స్టాలిన్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

భారతీయులందరి ప్రోత్సాహంతోనే ఎల్‌ఐసీ సంస్థ అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాంటి వెబ్‌సైట్‌లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయమన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భాషా దౌర్జన్యాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ ఇంపోజిషన్ ఆపండి (#StopHindiImposition) అంటూ హ్యాష్ ట్యాగ్ పెడుతూ ఎల్ఐసీ (LIC) వెబ్‌సైట్ ఫోటోను పెట్టారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, గతంలోనూ తమిళనాట హిందీ వివాదం అనేక సార్లు జరిగింది.

Tags:    

Similar News