దాహంతో రోడ్డు మీద పడిపోయిన ఒంటె.. నీళ్లు తాగించి బతికించిన ప్రయాణికుడు (వీడియో)
జూన్ నెల వచ్చినప్పటికీ భానుడి భగభగలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలు దంచికొడుతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జనం వణుకుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: జూన్ నెల వచ్చినప్పటికీ భానుడి భగభగలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలు దంచికొడుతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జనం వణుకుతున్నారు. ఇక జంతువుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎండతాపానికి తాళలేక జంతువులు విలవిలలాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎండదెబ్బకు దాహంతో రోడ్డు మీద పడిపోయింది ఓ ఒంటె. ఇంకా కొంచెం సేపయితే గొంతెడ్డి చనిపోయేది. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు తన వాహనం నుంచి బయటకు వచ్చి ఒంటెకు బాటిల్ లోని నీళ్లను తాగించాడు. దీంతో ఆ ఒంటె లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘ఎండదెబ్బకు తట్టుకోలేక ఓ ఒంటె రోడ్డు మీద సొమ్మసిల్లిపోయింది. కొంచెం సేపైతే చనిపోయేది. కానీ ఆ ఒంటె పరిస్థితి చూసి జాలిపడ్డ ఓ డ్రైవర్ దానికి నీళ్లు తాగించి బతికించాడు. నిజంగా అతడు గ్రేట్ ’’ అంటూ ప్రశంసలు కురిపించారు.
Drained by the heat, the camel was few minutes away from passing out. Kind driver gives water & revives it.
— Susanta Nanda (@susantananda3) June 11, 2023
We are experiencing unexpected heat waves. Your few drops of water can save the lives of animals. Be compassionate to our fellow travellers . pic.twitter.com/daE7q9otdv