సమ్మర్ వేడికి వైరైటీగా టిప్స్ ఇస్తున్న టీచర్! నెట్టింట నవ్వులే..
నవ్వులతో పాటు వ్యూవ్స్, లైక్స్ మోతుమోగుతున్నాయి. teacher in Bihar sing a song to give tips to his students about heat waves
దిశ, వెబ్‌డెస్క్ః దేశవ్యాప్తంగా ఎండ వేడికి ప్రాణం ఆవిరయ్యేట్లు ఉంది. మే నెలకు ముందే మంటెక్కించిన ఎండలు రోజు రోజుకూ రగిలిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో పిల్లల బడులకు సెలువులు కూడా ప్రకటించారు. ఇక, సెలవులకు ముందు పాఠశాల చివరి రోజుల్లో బీహార్‌లోని ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు వడగాలులు వీస్తున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి, ఒక ఆకర్షణీయమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మెడకు రెండు వాటర్ బాటిళ్లను తగిలించుకున్నీ టీచర్, "జబ్ ధూప్ రహే ఖూబ్ తేజ్, తో బహర్ నా జానా. ఖుద్ కో రఖ్నా ఘర్ మై సాహెజ్, కి బహర్ నా జానా" అంటూ వైరైటీగా ఓ పాట పాడతారు.
"బయట ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు, బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉంటూ తమ శక్తిని కాపాడుకోవాలి కానీ, బయటకు మాత్రం రాకూడదు" అంటూ పాటకు డ్యాన్స్ చేసిన ఉపాధ్యాయుడికి పిల్లలు చప్పట్లు కొడతారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ప్రస్తుతమున్న ఆందోళనకర వాతావరణం గురించి మాట్లాడతారు. "గర్మ్ హవైన్ భీ చల్నే లగీ హైం, లగ్తా హై ధరతీ భీ జల్నే లగీ హై (వేడి గాలులు వీచడం ప్రారంభించాయి, భూమి కూడా మండుతున్నట్లు అనిపిస్తుంది)" అని అంటారు. నీరు సమృద్ధిగా ఉండే పండ్లను తినడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండాలని తన విద్యార్థులకు సలహా ఇస్తూ, "భూఖే కభీ నా తుమ్ స్కూల్ ఆవో, కక్రీ-ఖర్బూజే కా భోగ్ లగావో (ఖాళీ కడుపుతో పాఠశాలకు రావద్దు, దోసకాయ, సీతాఫలం వంటి పండ్లను తినండి. )" అంటారు. ఈ వీడియోను ఉత్కర్ష్ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా నెట్టింట నవ్వులతో పాటు వ్యూవ్స్, లైక్స్ మోతుమోగుతున్నాయి.