Viral: ఇదెక్కడి దారుణం రా అయ్యా.. హల్చల్ చేస్తున్న శానిటరీప్యాడ్ యాడ్.. వీడియో వైరల్..!
సాదారణంగా మనం మన నిత్య జీవితంలో ప్రొడక్ట్స్‌కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తుంటాము.
దిశ వెబ్ డెస్క్: సాదారణంగా మనం మన నిత్య జీవితంలో ప్రొడక్ట్స్‌కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తుంటాము. ఆ ప్రకటనల్లో కొన్ని హాస్యాస్పదంగా ఉంటే మరి కొన్ని చిరాకు తెప్పిస్తాయి. ఇక కొన్ని ప్రకటనల్లో అయితే అసలు లాజిక్ అనే మాటే ఉండదు. అలాంటి ప్రకటనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాధారణంగా మనం శానిటరీప్యాడ్ యాడ్స్ తరచూ చూస్తూనే ఉంటాం.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాడ్ చూస్తే ఇలాంటి యాడ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనకుండా ఉండలేరు. ఇక భూతద్దం పెట్టి వెతికినా ఈ యాడ్ లో లాజిక్ దొరకదు. ఓ సముద్రంలో సర్ఫేస్ బోటింగ్ చేస్తున్న అమ్మాయి దగ్గరకి ఓ షార్క్ రావడం ఓ వ్యక్తి గమనిస్తాడు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఊహించని రీతిలో ఆ అమ్మాయి సముద్రంలో పడిపోతుంది.
ఇక ఆ వ్యక్తి చూస్తుండగానే ఆ సముద్రం నీరంతా ఇంకి పోతుంది. ఆ అమ్మాయి సురక్షితంగా బయటకి వస్తుంది. అయితే ఆ సముద్రం నీరంతా ఇంకి పోవడానికి కారణం ఆ అమ్మాయి శానిటరీప్యాడ్ని కలిగి ఉండడం. ఎలాగైతే ఆ సముద్రంలోని మొత్తం నీటిని శానిటరీప్యాడ్ పీల్చేసిందో అలానే పీరియడ్ టైంలో రిలీజ్ అయ్యే బ్లడ్‌ను కూడా పోల్చేస్తుంది అని ఈ యాడ్ ఉద్దేశం.
అయితే పీరియడ్ సమయంలో రిలీజ్ అయ్యే బ్లడ్‌ను గ్రహించి మరకలు పడకుండా ఉంటుంది అని చూపించడం తప్పు కాదు. కానీ సముద్రం నీటిని మొత్తం పీల్చుకుంటుందనే అతిశయోక్తిని ఈ యాడ్ లో చూపించారు. దీనితో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.