famous anchor: రేసుగుర్రం సీన్ రిపీట్.. ఈగను తిన్న ప్రముఖ యాంకర్
రేసుగుర్రం సినిమాలో ప్రకాష్ రాజ్ తన ఫ్యామిలీతో బోజనం చేస్తున్న సమయంలో ఓ ఈగ అక్కడకు వస్తుంది.
దిశ వెబ్ డెస్క్: రేసుగుర్రం సినిమాలో ప్రకాష్ రాజ్ తన ఫ్యామిలీతో బోజనం చేస్తున్న సమయంలో ఓ ఈగ అక్కడకు వస్తుంది. అయితే ఆ ఈగ ఎక్కడ శబ్దం చేస్తుందో అనే భయంతో వంటమనిషి ఆ ఈగను పట్టుకుని నోటిలో వేసుకున్న సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే అదే సీన్‌ను ఓ యాంకర్ రిపీట్ చేసింది. తాను ఎంతో ఏకాగ్రతతో వార్తలు చదువుతున్న సమయంలో ఓ ఈగ ఆమెను ఇబ్బందిపెట్టింది.
దీనితో ఆ యాంకర్ ఆ ఈగను తినేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెనెస్సా వెల్చ్ అనే మహిళ అమెరికాలోని బోస్టన్ 25 న్యూ యాంకర్‌గా పనిచేస్తోంది. అయితే ఎప్పటిలానే తాను న్యూస్ చదువుతున్న సమయంలో ఆమె కన్ను రెప్పలపై ఈగ వాలింది. కాసేపటికి ఆ ఈగ ఆమె నోటిపై పడబోయింది.
ఈ నేపథ్యంలో వార్తలు చదివేందుకు ఇబ్బంది కలగకుండా ఆ యాంకర్ ఆ ఈగను నోట్లో పెట్టేసుకుని అక్కడ వార్తలు చదవడం మినహాయించి ఇంకేమి జరగనట్టు కవర్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.