Petrol news: 61 ఏళ్ల కిందట 5 లీటర్ల పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే షాక్.. గోల్డెన్ డేస్ మళ్లీ రావంటూ కామెంట్స్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) పెట్రోల్ ధరలు వంద రూపాయలకు పైనే ఉంది.

Update: 2025-01-10 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) పెట్రోల్ ధరలు వంద రూపాయలకు పైనే ఉంది. జనాలు పెట్రోల్ ధరలు ఎప్పుడెప్పుడూ తగ్గుతాయా? అని ఎదురుచూస్తున్నారు. ప్రతీ నెల ఒకటవ తారీకున ధరల్లో మార్పులు జరుగుతాయని కొండంత ఆశతో చూస్తారు. కానీ పెట్రోల్ ధరలు కొంతకాలం నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఒకప్పుటి ధరల గురించి మాట్లాడుకున్నట్లైతే.. అన్ని గోల్డెన్ డేసే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నిత్యావసరాల నుంచి ప్రతీ ఒకటి మనం వాడే వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ రేట్లు(petrol) అయితే ఏడాది ఏడాదికి పెరుగూనే ఉంటున్నాయి.

అయితే సోషల్ మీడియాలో వచ్చిన్పప్పటి నుంచి నలుమూలల ఏం జరిగినా.. వెంటనే మన కళ్లముందే కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వెనకటి కాలం నాటివి ఏం కనిపించినా కూడా కొంతమంది.. వాటిని ఫొటోలు తీసి మధుర జ్జాపకాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా 1963 లో 5 లీటర్ల పెట్రోల్ ధరకు సంబంధించిన ఓ బిల్లు చిట్టి నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటి రేటును ఇప్పటి ధరతో పోల్చి చూస్తే జనాలు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కేవలం 3. 60 రూపాయలే ఉండటం విశేషం. ఆ కాలం నాటి పెట్రోల్ బిల్లు చూసి జనాలు గోల్డెన్ డేస్ మళ్లీ రావు అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 

 


Similar News