ఇది అదే.. అది ఇది కాదు.. కూరగాయల షాపు దగ్గర దిష్టిబొమ్మలా మహిళ ఫొటో.. నెట్టింట వైరల్

మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, అలానే ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకున్నప్పుడు నరుల దిష్టి తగలకుండా దిష్టిబొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం.

Update: 2024-05-12 16:57 GMT

 దిశ వెబ్ డెస్క్: మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, అలానే ఏదైనా కొత్త వ్యాపారం పెట్టుకున్నప్పుడు నరుల దిష్టి తగలకుండా దిష్టిబొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే అలాంటి దిష్టిబొమ్మలను మనం రోజువారి జీవితంలో ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. అలానే ఓ కూరగాయల షాపు వ్యక్తి కూడా తన షాపు దగ్గర ఒక దిష్టిబొమ్మను పెట్టుకున్నారు.

అయితే ప్రస్తుతం ఆ దిష్టిబొమ్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటి దిష్టిబొమ్మ పెట్టుకుంటే అందులో వింతేముంది అనుకుంటున్నారా? అతను పెట్టుకున్న దిష్టిబొమ్మ ఫోటో మనం రెగ్యులర్‌గా చూసే దిష్టిబొమ్మ ఫోటో కాదు. అతను ఒక మహిళ కోపంగా ఉన్న ఫోటోని దిష్టిబొమ్మలాగా తన షాపు దగ్గర పెట్టుకున్నారు.

ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులో కూరగాయల షాప్ అతను చాలా కోపంగా, కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తున్న ఒక మహిళ ఫోటోను తన షాపు దగ్గర పెట్టుకున్నారు. అటుగా వెళుతున్న ఎవరో ఒక వ్యక్తి ఆ ఫోటోను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకి నేను ఈ రోజు బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని క్యాప్షన్‌ను జోడించారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్స్ ఆమె షాపు అతని భార్య కావచ్చు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్స్ ఆమె షాపు అతని భార్య కాకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.


Similar News