SBI పరువు గాల్లో కలిపిన కస్టమర్.. ప్రపంచం మారినా మీ సేవలు మాత్రం అంటూ..

ఈ మధ్య చాలా అవసరం అయితే తప్ప బ్యాంకుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే అన్ని ఆన్ లైన్ సేవలు వచ్చేశాయి. అయితే అంత అత్యవసరం వచ్చి

Update: 2024-06-01 13:10 GMT

దిశ, ఫీచర్స్: ఈ మధ్య చాలా అవసరం అయితే తప్ప బ్యాంకుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే అన్ని ఆన్ లైన్ సేవలు వచ్చేశాయి. అయితే అంత అత్యవసరం వచ్చి అక్కడికి వెళ్తే.. బ్యాంకు సిబ్బంది కనీసం కస్టమర్ చెప్పేది పూర్తిగా వినకుండానే ఈరోజు పని కాదని వెనక్కి పంపించేస్తారు. ఇలాంటి ఘటనే ప్రభుత్వ బ్యాంకు SBIకి వెళ్ళిన వ్యక్తికి ఎదురైంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వెళ్లిన తనకు సేవలు అందించేందుకు ఒక్క ఉద్యోగి కూడా అందుబాటులో లేరు. గుంపుగా ఒకేసారి వెళ్లి భోజనం చేస్తున్నారు. అయితే రూల్స్ ప్రకారం వీరికి లంచ్ టైం ఉండదు. కానీ అందరూ అలా వెళ్ళేసరికి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రపంచం మారినా మీ సేవలు మాత్రం మారవు అంటూ పోస్ట్ చేశాడు.

దీనిపై స్పందించిన SBI కస్టమర్ కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. బ్యాంకు ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు నిషేధమని వెంటనే తొలగించకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో సదరు కస్టమర్ ఆ వీడియో డిలీట్ చేశాడు.


Similar News