యువకుడి కడుపులో 16 ఇంచుల తొడిమతో ఉన్న సొరకాయ.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ఎన్నో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో ఎన్నో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా చాలా మంది చిన్నారులు తెలియక కాయిన్స్ మింగడం వంటివి చేస్తుంటారు. అయితే కొందరికి అవి బాత్రూమ్ ద్వారా బయటపడితే.. మరికొందరికి మాత్రం ఆపరేషన్ చేసి మరీ తీస్తారు. చిన్న మొలలు, ఇనుప వస్తువులు లేదా ఇతర వాటిని మింగినప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ వ్యక్తి కడుపు నొప్పితో విలవిలాడుతూ హాస్పిటల్‌కు వెళ్లాడు. అతనికి పరీక్షలు చేసిన వైద్యులు ఖంగుతిన్నారు. అతని కడుపులో 16 ఇంచుల సొరకాయ తొడిమతో ఉన్నట్లు గుర్తించి వెంటనే సర్జరీ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది తెలిసిన వారు షాక్ అవుతున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లో ఛత్తర్‌పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఖుజురహోకు గ్రామానికి చెందని ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్‌కు వెళ్లాడు. అయితే అతనికి ఎక్స్‌రే తీసిన వైద్యులు కడుపులో సొరకాయను గుర్తించి సర్జరీ చేయాలని చెప్పారు. గంటల తరబడి శ్రమించిన వైద్యులు అతని కడుపులో నుంచి సొరకాయను తొలగించినట్లు సమాచారం. అది అతని కడుపులోకి ఎలా పోయిందో డాక్టర్లకు కూడా మిస్టరీగా మారింది. దానికి కారణం తెలియనప్పటికీ అతడు మాత్రం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.