రెండో రోజు రవాణా ఆదాయం రూ.2.8 కోట్లు

దిశ, న్యూస్‌ బ్యూరో: లాక్‌డౌన్ సడలింపులతో రాష్ట్రంలో ఆర్టీఏ సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన రెండో రోజు రవాణా శాఖకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయం పెరిగింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పన్నులు, ఫీజులు కలిపి రూ.1.8 కోట్లు రాగా శుక్రవారం సాయంత్రానికి రూ.2.8 కోట్లు వసూలైనట్లు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు వెల్లడించారు. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ అన్నిరకాల సేవల్లో మొత్తం 1,600 లావాదేవీలు […]

Update: 2020-05-08 10:47 GMT

దిశ, న్యూస్‌ బ్యూరో: లాక్‌డౌన్ సడలింపులతో రాష్ట్రంలో ఆర్టీఏ సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన రెండో రోజు రవాణా శాఖకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయం పెరిగింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పన్నులు, ఫీజులు కలిపి రూ.1.8 కోట్లు రాగా శుక్రవారం సాయంత్రానికి రూ.2.8 కోట్లు వసూలైనట్లు రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు వెల్లడించారు.

శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ అన్నిరకాల సేవల్లో మొత్తం 1,600 లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడటం, ఫిజికల్ డిస్టెన్స్ (భౌతిక దూరం) పాటించడం, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ అందించడం లాంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

Tags: telangana, transport, tax collection, lockdown, on friday

Tags:    

Similar News

టైగర్స్ @ 42..