రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో పలువురి డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 19 మంది డీఎస్పీలకు స్థాన చలనం కల్పించారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న జి హనుమంతరావు కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీగా, ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న ఎ. చంద్రశేఖర్‌ను కూకట్ పల్లి ఏసీపీగా, ఇక్కడ ఏసీపీగా ఉన్న బి. సురేందర్ రావును సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఇంటలీజెన్స్‌లో అటాచ్డ్ గా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో పలువురి డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 19 మంది డీఎస్పీలకు స్థాన చలనం కల్పించారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న జి హనుమంతరావు కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీగా, ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న ఎ. చంద్రశేఖర్‌ను కూకట్ పల్లి ఏసీపీగా, ఇక్కడ ఏసీపీగా ఉన్న బి. సురేందర్ రావును సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఇంటలీజెన్స్‌లో అటాచ్డ్ గా ఉన్న ఎ. కర్ణాకర్‌ను కాగజ్ నగర్ డీఎస్పీగా, సైబరాబాద్ సీటీసీ ఏసీబీ బాలకృష్ణారెడ్డిని ఇబ్రహీంపట్నంకు, ఇక్కడ పని చేస్తున్న వి. యాదగిరి రెడ్డిని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
ఎస్ఐబీలో అటాచ్డ్ డీఎస్సీగా పనిచేస్తున్న ఎం. రమేష్‌ను గజ్వేల్‌కు, భూపాలపల్లి ఎస్సీ అటాచ్డ్ డీఎస్సీగా ఉన్న ఆర్. శ్రీనివాస్‌ను, ఆసిఫాబాద్‌కు, కరీంనగర్ సీపీ అటాచ్డ్‌గా ఉన్న రత్నాపురం ప్రకాష్‌ను జగిత్యాలకు, ఇక్కడ పనిచేస్తున్న వెంకటరమణనను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్. సతీష్ కుమార్‌ను గోషామహల్ ఏసీపీగా, ఊట్నూరు డీఎస్సీ ఉదయ్ రెడ్డిని చౌటుప్పల్‌కు, ఇక్కడ పనిచేస్తున్న సత్తయ్యను చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ సాయిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరికి, ఏసీబీ డీజీకి అటాచ్‌గా ఉన్న వాసాల సతీష్‌ను హుస్నాబాద్‌కు, వెయిటింగ్‌లో ఉన్న సిహెచ్ దేవారెడ్డిని సిద్దిపేట ఏసీపీగా, ఎన్‌సీ రంగస్వామిని గద్వాల్‌కు, ఇక్కడ పనిచేస్తున్న యాదగిరిని చీఫ్ ఆఫీస్‌కు, సిద్దిపేట సీపీకి అటాచ్డ్‌గా ఉన్న సైదులను మెదక్‌కు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.