తెలంగాణలో భారీగా డీఈఓల బదిలీలు

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంవత్సం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీలను చేపట్టింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది డీఈఓలను, డిప్యూటీ డీఈఓలను బదిలీ చేశారు. ఖమ్మం డీఈవోగా ఎస్‌.యాదయ్యను, భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డిను, చైతన్య జైనీని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డీఈఓగా నియమించిన డీఈఓగా అధనపు బాధ్యతలు అందాచారు. వీటితో పాటు ఎస్‌సీఈఆర్టీగా కూడా విధులు నిర్వహించనున్నారు. మోడల్‌ స్కూల్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్‌.ఎస్‌.సూర్యప్రసాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి డీఈవోగా సూర్యప్రసాద్‌(అదనపు బాధ్యతలు), […]

Update: 2021-06-14 11:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంవత్సం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీలను చేపట్టింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది డీఈఓలను, డిప్యూటీ డీఈఓలను బదిలీ చేశారు. ఖమ్మం డీఈవోగా ఎస్‌.యాదయ్యను, భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డిను, చైతన్య జైనీని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డీఈఓగా నియమించిన డీఈఓగా అధనపు బాధ్యతలు అందాచారు. వీటితో పాటు ఎస్‌సీఈఆర్టీగా కూడా విధులు నిర్వహించనున్నారు.

మోడల్‌ స్కూల్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్‌.ఎస్‌.సూర్యప్రసాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి డీఈవోగా సూర్యప్రసాద్‌(అదనపు బాధ్యతలు), సంగారెడ్డి డీఈవోగా నాంపల్లి రాజేశ్‌, కరీంనగర్‌ డీఈవోగా సీహెచ్‌.వి.ఎస్‌.జనార్దన్‌రావు, రంగారెడ్డి డీఈవోగా పి.సుశీంద్రరావు, నారాయణపేట డీఈవోగా లియాఖత్‌ అలీ, వనపర్తి డీఈవోగా ఎ.రవీందర్‌, జోగులాంబ గద్వాల డీఈవోగా మహ్మద్‌ సిరాజుద్దీన్‌, జనగాం డీఈవోగా టి.రాము(అదనపు బాధ్యలు) నియమించారు. మేడ్చల్ జిల్లా డీఈవోగా ఉన్న విజ‌య‌కుమారిని స్కూల్ ఎడ్యూకేష‌న్ లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించారు.

Tags:    

Similar News