బిగ్ బ్రేకింగ్: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్, సైబరాబాద్ సీపీగా స్టీఫెన్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో గత కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ చివరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ బదిలీకి దారితీసింది. దీర్ఘకాలంగా ఆర్టీసీ ఎండీగా ఉన్న సునీల్ శర్మ ప్రస్తుతం రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కొనసాగనున్నారు. ఆర్టీఎసీ ఎండీగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నగర పశ్చిమ జోన్ ఐజీగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో గత కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ చివరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ బదిలీకి దారితీసింది. దీర్ఘకాలంగా ఆర్టీసీ ఎండీగా ఉన్న సునీల్ శర్మ ప్రస్తుతం రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కొనసాగనున్నారు. ఆర్టీఎసీ ఎండీగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నగర పశ్చిమ జోన్ ఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆర్టీసీ రుణాలు, వాటి వినియోగానికి సంబంధించి మంత్రికి, ఆ సంస్థకు ఎండీగా ఉన్న సునీల్ శర్మకు మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు రావడం ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ వెళ్ళింది. బ్యాంకుల నుంచి సంస్థ తరఫున తీసుకున్న రుణాలను ఏ అవసరాలకు వినియోగించాలన్న అంశంలో మంత్రికి, ఆర్టీసీ ఎండీకి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు అది చర్చనీయాంశంగా మారడంతో సునీల్ శర్మ బదిలీతో ముగింపు పలికినట్లయింది.