కరోనాను జయించిన కానిస్టేబుల్ ఆత్మహత్య

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనాను జయించిన కానిస్టేబుల్ చేసిన అప్పులను ఏ విధంగా తీర్చాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఏపీ‌హెచ్‌పీ వెంకటేశ్వర కాలనీలో జరిగింది. నవిపేట మండలం అనంతగిరికి చెందిన గాంధారి ప్రమోద్ రెడ్డి (33) నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారీన పడిన ప్రమోద్ కోలుకున్నారు. ఓ గండం గడిచిందని కుటుంబీకులు అనుకునే లోపే […]

Update: 2021-05-06 01:18 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనాను జయించిన కానిస్టేబుల్ చేసిన అప్పులను ఏ విధంగా తీర్చాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఏపీ‌హెచ్‌పీ వెంకటేశ్వర కాలనీలో జరిగింది. నవిపేట మండలం అనంతగిరికి చెందిన గాంధారి ప్రమోద్ రెడ్డి (33) నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారీన పడిన ప్రమోద్ కోలుకున్నారు. ఓ గండం గడిచిందని కుటుంబీకులు అనుకునే లోపే గతంలో చేసిన అప్పుల బాధ తాళలేక చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు వేరు వేరు గదుల్లో నిద్రిస్తుండగా బెడ్రూంలో ఉరివేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబీకులు ఆస్పత్రి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే మృతి చెందారు.

Tags:    

Similar News