విద్యాశాఖ మంత్రికి టీపీటీఎఫ్ విజ్ఞప్తి
దిశ, న్యూస్బ్యూరో: ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తుండటంతో ప్రైవేటు టీచర్లు ఆకలితో అలమటిస్తున్నారని, వారి సమస్యలను తీర్చాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి టీపీటీఎఫ్ కొడంగల్, వికారాబాద్ జిల్లా కమిటి సభ్యులు తమ గోడును తెలియజేశారు. అనేకసార్లు ఫోరం రాష్ట్ర సభ్యులు మంత్రిని నేరుగా కలిసి సమస్యలు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. నాలుగు నెలలుగా ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. […]
దిశ, న్యూస్బ్యూరో: ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తుండటంతో ప్రైవేటు టీచర్లు ఆకలితో అలమటిస్తున్నారని, వారి సమస్యలను తీర్చాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి టీపీటీఎఫ్ కొడంగల్, వికారాబాద్ జిల్లా కమిటి సభ్యులు తమ గోడును తెలియజేశారు. అనేకసార్లు ఫోరం రాష్ట్ర సభ్యులు మంత్రిని నేరుగా కలిసి సమస్యలు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. నాలుగు నెలలుగా ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.