త్వరలోనే మంత్రి హరీష్‌ను కలుస్తా.. పొలిటికల్ హీట్ పెంచిన రేవంత్
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చాలా మార్పులు వస్తాయని, ‘కారు’లో తిరుగుబాటు మొదలవుతుందని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటును ఎదుర్కొనేందుకే విజయగర్జన, ప్లీనరీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈటల రాజేందర్‌ను బయటకు పంపినట్టే త్వరలోనే మంత్రి హరీష్‌రావును కూడా పార్టీ నుంచి బయటకు పంపేందుకు కేసీఆర్ ప్లాన్ వేశారని పేర్కొన్నారు. మిత్ర ద్రోహి పేరుతో హరీష్‌ను శ్మశాన వాటికకే […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చాలా మార్పులు వస్తాయని, ‘కారు’లో తిరుగుబాటు మొదలవుతుందని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటును ఎదుర్కొనేందుకే విజయగర్జన, ప్లీనరీ నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈటల రాజేందర్‌ను బయటకు పంపినట్టే త్వరలోనే మంత్రి హరీష్‌రావును కూడా పార్టీ నుంచి బయటకు పంపేందుకు కేసీఆర్ ప్లాన్ వేశారని పేర్కొన్నారు. మిత్ర ద్రోహి పేరుతో హరీష్‌ను శ్మశాన వాటికకే పంపుతాడన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత హరీష్ అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఓడినా.. గెలిచినా ఎవరికీ లాభం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ముందస్తుకు వెళ్లనని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని, గుజరాత్‌తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. మోడీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ఎన్నికలకు వెళ్తారని, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కేసీఆర్ దళిత ద్రోహి అని మరోసారి రుజువు అయిందని, సొంత పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదని, దళిత ద్రోహి నాయకత్వంలో మరో దళిత నాయకుడు(మోత్కుపల్లి నర్సింహులు) జాయిన్అయ్యాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.