Eluru: సీపీఐ కార్యాలయం కూల్చివేత.. ఉద్రిక్తత

ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో సీపీఐ కార్యాలయాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు..

Update: 2024-12-26 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) బుట్టాయగూడెం(Buttayagudem)లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించారు. అనుమతి లేని భవనాలను కూల్చివేశారు. ఈ క్రమంలో సీపీఐ కార్యాలయం(CPI Office) నిర్మాణంలోనూ నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించారు. దీంతో సీపీఐ కార్యాలయాన్ని కూడా వేశారు. అయితే సీపీఐ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సీపీఐ నాయకులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వానికి, స్థానిక రెవెన్యూ అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం అక్రమమని మండిపడ్డారు. బుట్టాయగూడెంలోని ప్రభుత్వం భూముల్లో పలు పార్టీల లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతుంటే పట్టించుకోని అధికారులు.. ప్రజల కోసం నిర్మించిన తప పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడమేంటని ప్రశ్నించారు.ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీపీఐ కార్యాలయానికి భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు కొనసాగిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.  

Tags:    

Similar News