ప్రజల ఆస్తులు అమ్మేందుకు సిద్ధమయ్యారు: ఉత్తమ్

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తుంటే మద్దతు ధరపై ప్రకటన చేయకుండా, ప్రజల ఆస్తులు అమ్మేందుకు కేంద్రం సిద్ధమైందని విమర్శించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్న ఉత్తమ్… హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇవ్వడం దుర్మార్గమని, తెలంగాణకు […]

Update: 2021-02-01 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తుంటే మద్దతు ధరపై ప్రకటన చేయకుండా, ప్రజల ఆస్తులు అమ్మేందుకు కేంద్రం సిద్ధమైందని విమర్శించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామన్న ఉత్తమ్… హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇవ్వడం దుర్మార్గమని, తెలంగాణకు ఈ బడ్జెట్‌లో దక్కింది శూన్యమన్నారు.

Tags:    

Similar News